మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం

 telugu పండుగలు  తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు కథ


ఇది నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజ జీవితంలోని జరిగిన సంఘటన, చరిత్రలో నిలిచిన కథ.

నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా పరమ శివుడు కనిపించాడు. నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.

1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు, “ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఆమె పేరు మేరీ. ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యానాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. ఆ పూజారులు “ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” గ్రహించి పలకరించారు.

ఆ పూజారులు “ఏమైంది తల్లి నీకు అని అడగగనే, వెంటనే ఆమె భర్త ‘కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ “మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు. ఆమె గుడిలో మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ “లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.

11 రోజుల జపం చేసిన తర్వాత, ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని. ఆయన పులి చర్మం ధరించి, మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. ఆయన శక్తికి, తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.

కొన్ని వారాల తర్వాత,కల్నల్ ఇంటికి చేరుకున్నారు. తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. కల్నల్ గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ “మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. జన్మ ధన్యం చేసుకున్నారు. ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే. ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...

 

 

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.